సచివాలయ సిబ్బందితో టీమ్స్ గా ఏర్పాటు చేసి పన్ను వసూళ్ళు వేగవంతం చేయాలని రీజినల్ డైరెక్టర్ ఆఫ్‌మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రవీంద్ర పేర్కొన్నారు. ఆయన బొబ్బిలిలో గురువారం సాయంత్రం ఆకస్మికంగా మున్సిపల్ కార్యలయం తనిఖీ చేశారు. మార్చి నెలాఖరులోగా పన్నులు వసూలు శత శాతం పూర్తి చేయాలన్నారు. పన్నులు వసూళ్లపై పర్యవేక్షణ చేయాలని కమిషనర్ రామలక్ష్మీని ఆదేశించారు. పన్నుల వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించలన్నారు.