మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం మాతుమూరు సమీపంలో శుక్రవారం రెండు బోలోరోల వాహనాల్లో తరలిపోతున్న 670కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి విజయనగరం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పాచిపెంట పోలీసులు, రెండు బొలెరోలతో పాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.