రోడ్డు ప్రమాద నివారణకు ఆర్టీసీ డ్రైవర్లు కృషి చేయాలని ఎస్. కోట ఆర్టీసీ డిపో మేనేజర్ కే రమేష్ కోరారు. ఈ మేరకు ఆయన ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఆదివారం డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన తగు సూచనలు, సలహాలు చేశారు. డ్రైవర్లు విధి నిర్వహణలో లేని సమయాల్లో తగు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై ఆయన డ్రైవర్లకు అవగాహన కల్పించారు.