
కనిగిరిలో ఈనెల 29న జాబ్ మేళా
కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 18 నుండి 27 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. ఇంటర్ నుండి డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.