
కనిగిరి: రిలయన్స్ ప్రతినిధులతో ఎమ్మెల్యే ఉగ్ర భేటీ
రిలయన్స్ ప్రతినిధులతో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి బుధవారం సమావేశమయ్యారు. కనిగిరి ప్రాంతంలో త్వరలో ప్రారంభించనున్న బయో గ్యాస్, ఎనర్జీ ప్లాంట్ గురించి చర్చించారు. రిలయన్స్ బయోగ్యాస్, ఎనర్జీ ప్లాంట్ గురించి అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేసిన నేపథ్యంలో రిలయన్స్ ప్రతినిధులతో ఎమ్మెల్యే ఉగ్రసమావేశమై వీటిపై చర్చించారు.