వృద్ధ మహిళలకు మత్తుమందు ఇచ్చి నగలు దోపిడీ చేస్తున్న ఓ మహిళను బుధవారం సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావులు అరెస్టు చేశారు. 460 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు మత్తు కోసం వాడిన ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ తెలిపారు. మత్తు మందు ఇచ్చి 9 చోరీలు, 2 షాపుల్లో దొంగతనాలు చేశారన్నారు. మహిళ చేసిన చోరీల విలువ రూ. 35 లక్షలు వరకు ఉంటుందన్నారు.