తాళ్లూరులో ఎరువుల దుకాణాలపై విస్తృత తనిఖీలు

74చూసినవారు
తాళ్లూరులో ఎరువుల దుకాణాలపై విస్తృత తనిఖీలు
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. డిఏపి, యూరియా, 20:20:0:13, పిపిఎల్, శాంపిల్స్ ను తీసుకొని రీజనల్ కోడింగ్ సెంటర్ అమరావతిలోని తాడేపల్లిగూడెంకు పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం అనుమతులు పొందిన ఎరువులు, పురుగుమందును విక్రయించాలని దుకాణదారులకు అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్