వైసీపీ శ్రేణులతో బుర్ర మధుసూదన్ రావు సమావేశం
కందుకూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బుర్ర మధుసూదన్ రావు గురువారం కందుకూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాల గురించి నాయకులతో చర్చించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన నిలబడి పోరాడాలన్నారు.