మార్కాపురం: వేమన జయంతి సందర్బంగా రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ

72చూసినవారు
మార్కాపురం: వేమన జయంతి సందర్బంగా రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ
యోగి వేమన జయంతి పురస్కరించుకొని మార్కాపురం రెడ్డి సంక్షేమ సేవ సంఘం నియోజకవర్గ కన్వీనర్ గుంటక సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలువురి ఆర్థిక సహకారంతో స్థానిక జిల్లా వైద్యశాల నందు వైద్యశాల సిబ్బంది సహకారంతో వార్డులలో రోగులకు నాన్ రొట్టెలు, పండ్లను పంపిణీ చేశారు. ముందుగా పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సమీపంలో గల రెడ్డి సంక్షేమ సేవ కార్యాలయం నందు యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్