మార్కాపురం: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

80చూసినవారు
మార్కాపురం: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం జిల్లా మార్కాపురంలో అక్రమ రేషన్ బియ్యాన్ని ఆదివారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఓ గదిలో అక్రమంగా నిలువ ఉంచిన 40 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అక్రమ రేషన్ బియ్యం నిలువ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని మార్కాపురం ప్రభుత్వ గోదాముకు తరలించారు.

సంబంధిత పోస్ట్