ధర్నాను జయప్రదం చేయండి
వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వాహన లైసెన్సులు ఇచ్చే అధికారాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వకూడదంటూ.. సెప్టెంబర్ 24న ఆర్టీవో కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నామని నెల్లూరు రూరల్ సిఐటియు నాయకులు ఎం.సుధాకర్ తెలిపారు. సోమవారం ఆయన ముత్తుకూరు గేటు వద్ద ఉన్న సిఐటియు కార్యాలయంలో మాట్లాడుతూ.. రేపు జరిగే ధర్నాలో ఆటో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.