నెల్లూరు నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా : మంత్రి నారాయణ
నెల్లూరు నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆదివారం నగరంలోని క్యాంప్ కార్యాలయంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ల పరిధిలోని ప్రతి సమస్యను తన దృష్టికి తేవాలని సూచించారు. నాయకులందరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.