టిడ్కో గృహ సముదాయాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టండి
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వెంకటేశ్వర పురం టిడ్కో గృహ సముదాయాల వద్ద.. ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టాలని, మురుగు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. ఎల్ & టి సంస్థ ప్రతినిధులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులతో కలిసి స్థానిక టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణాన్ని కమిషనర్ బుధవారం పరిశీలించారు.