78వ స్వాతంత్ర దినోత్సవంగా విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు నెల్లూరులో మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ పురస్కారాలకు ఉదయగిరి మండలంలో వివిధ శాఖలలో పని చేస్తున్న ముగ్గురు అధికారులు ఎన్నికయ్యారు. ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి, మలేరియా సబ్ యూనిట్ అధికారి నౌషాద్ బాబు, లీడింగ్ ఫైర్ మ్యాన్ అర్రయ్య లు ఎంపికయ్యారు.