శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోటుకు పల్లి గ్రామంలో కదిరి రూరల్ సీఐ నిరంజన రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలతో పోలీస్ ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ ప్రభావం, నిర్మూలన, సెల్ ఫోన్, స్నేహితుల ప్రభావం గురించి వివరించారు.