ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన గురుకుల ఉపాధ్యాయులు గత 34 రోజులుగా చేస్తున్న సమ్మెపై స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్, మారుతి ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 సంవత్సరాల నుండి 26 జిల్లాల్లో గిరిజన గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా పని చేస్తున్న 4659 మంది తమ డిమాండ్ల సాధన కోసం 31 రోజులుగా సమ్మె చేస్తున్నారన్నారు.