ఉరవకొండ మండలం పెనహోబిలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామికి గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన గుడిసె రాయలు ఓబయ్య కుటుంబీకులు రూ. లక్ష రూపాయల విలువ చేసే వెండి కిరీటాన్ని బహుకరించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. దేవస్థానంలో లాంచనప్రాయంగా స్వామివారికి పూజలు చేసి వెండి కిరీటాన్ని అందజేసినట్లు దేవస్థాన ఈవో సాకే రమేష్ బాబు తెలిపారు.