నందవరం: అదుపు తప్పి లారీ బోల్తా
కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని ముగతి వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి పత్తి బెల్ లోడ్‌తో వెళ్తున్న లారీ ముగతి గ్రామం సాయిరాం వాటర్ ప్లాంట్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడ్డారని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.