భామిని: విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై మండిపాటు
భామిని మండలం, పసుకుడి గ్రామంలో పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి, ఈ ఐదు నెలలలోనే విద్యుత్ ఛార్జీలు పెంచుతారా అని కూటమి ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. తక్షణమే విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం బెల్ట్ షాప్లతో ప్రతీ ఊరుని తగలబెడుతూ, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.