పాలకొండ: ఖైదీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి
జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. శుక్రవారం పాలకొండ సబ్ జైలును మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఇంఛార్జ్ ఛైర్మన్ పిఎస్విబి కృష్ణ సాయితేజతో కలిసి సందర్శించారు. కిచెన్, స్టోర్ రూంలో ఉన్న వంట సరుకులను వారు పరిశీలించారు. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖైదీలకు సూచించారు.