వీరఘట్టం: మహిళల భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం
వీరఘట్టం మండల కేంద్రంలోని గాయత్రి కళాశాలలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై శనివారం ఎస్ఐ కళాధర్ అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రతపై అవగాహన, ఆత్మ రక్షణ కోసం సలహాలు, సూచనలు వివరించారు. చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా, బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన, ఇబ్బంది కలిగించిన, 100, 112, 1930 నంబర్లను సంప్రదించాలన్నారు.