పెట్రోల్ బంక్ నిర్మాణ స్థలం పరిశీలించిన జేసీ

55చూసినవారు
పెట్రోల్ బంక్ నిర్మాణ స్థలం పరిశీలించిన జేసీ
లక్ష్మీనర్సుపేట మండలంలోని.. అలికాం-బత్తిలి ప్రధాన రహదారి పక్కన పెట్రోల్ బంక్ నిర్మాణ స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు మేరకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అన్ని పరిశీలనలు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బి.సుదర్శన్ దొర, తహసీల్దారు వై.వి.పద్మావతి, మండల సర్వేయర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్