గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న పలు గిరిజన గ్రామాలలో గిరిజనుల సమస్యల పట్ల దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు. గురువారం పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావును గిరిజన సభ్యులతో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్థానిక నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో సమస్యలపై దృష్టి సారించాలన్నారు.