తిరుపతిలో ముక్కోటి ఏకాదశి దర్శనాల కోసం జరిగిన సంఘటన దురదృష్టకరంగా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం టిడిపి నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి వెంకన్నను దర్శించుకోవాలని ఆత్రుతతో ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు తొక్కిసలాట జరగడంతో పలువురు భక్తులు మృతి చెంది మరికొందరు గాయాలు పాలైనారని, ప్రభుత్వం తక్షణమే స్పందించందన్నారు.