కొత్తూరు: ఆదివాసీ సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి

83చూసినవారు
గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం కొత్తూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన సమస్యలపై ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలో ఐ టి డి ఏ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ భూమికి పట్టాలను ఇవ్వాలని ప్రభుత్వన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ధర్నా ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్