మాలకొండ అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ స్వామి దేవస్థానం నందు జరగవలసిన అభివృద్ధి పనులపై శుక్రవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాలకొండపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాలకొండపైకి వెళ్ళు మార్గంలో డబల్ రోడ్డు, కొండపైన అమ్మవారు గుడికి వెళ్ళు మార్గంలో నూతన మెట్ల నిర్మాణం, ఎవరైనా ప్రముఖులు పుణ్యక్షేత్రానికి వచ్చిన సమయంలో వేద పండితులచే ఆశీర్వచనం కొరకు నూతన రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.