కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా కుప్పంలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రెసిడెంట్ మంజునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. రోగులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.