కుప్పంలో కొత్త బస్సు సర్వీసులను పలువురు టీడీపీ నాయకులు గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం చేతుల మీదుగా కుప్పం నుంచి విజయవాడకు రెండు నూతన బస్సులు, కుప్పం నుంచి తిరుపతికి మూడు నూతన బస్సులను కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రారంభించారు. ప్రయాణికులకు ప్రభుత్వం మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పిస్తోందని వారు తెలిపారు.