నర్సాపురం: అంబేద్కర్ యువత ఆదర్శంగా తీసుకోవాలి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆయన స్వహస్తాలతో రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచానికి మార్గ ధర్శకంగా నిలిచిందని తెలిపారు.