చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి సమన్వయంతో ముందుకు వెళ్దామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన డీఆర్సీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. జిల్లాను వ్యవసాయ, విద్య, వైద్య, ఇరిగేషన్, ఉపాధి, పారిశ్రామిక రంగాలలో ప్రథమ స్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.