పీలేరు క్రాస్ రోడ్ లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయండి
పీలేరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నందున పీలేరు క్రాస్ రోడ్ లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ నాయుడు కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీలేరు పట్టణంలోని నాలుగు రోడ్లు జాతీయ రహదారులు కలిసే సర్కిల్లో సిగ్నల్ లైట్లతో ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు.