చిలేకాంపల్లె ఉప సర్పంచ్ మృతి
కడప జిల్లా చక్రాయపేట మండల పరిధిలోని చిలేకాంపల్లె గ్రామ ఉపసర్పంచ్ బెల్లం లక్ష్మీదేవమ్మ (70) మంగళవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. మృతురాలు గతంలో చిలేకాంపల్లి సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె కోడలు వర్ధనమ్మ చిలేకాంపల్ల ఎంపీటీసీ సభ్యురాలుగా ఉన్నారు. లక్ష్మీ దేవమ్మ కుమారుడు బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.