వేంపల్లి: ట్రిపుల్ ఐటిలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి అస్వస్థత
వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి ఓల్డ్ క్యాంపస్ మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్యాంపస్ లో ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది వారికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొందరికి 4 రోజులుగా ఆరోగ్యం బాలేదని, ప్రస్తుతం విద్యార్థులకు ప్రమాదం లేదని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు.