పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం దేవలంపేట శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చనలు పూజలు జరిపి నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి నివేదించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల అందించారు.