చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమీపంలోని పెద్దారి కుంట గ్రామంలో సోమవారం ఇంటి ముందర చెత్త విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో మంగమ్మపై అదే గ్రామానికి చెందిన మునిరత్నం దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. మంగమ్మను కుటుంబ సభ్యులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.