సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.