నెల్లూరు జిల్లాలో ఏసీబీకి చిక్కిన ఉప ఖజనా అధికారిణి
ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వరికుంటపాడు మండలానికి చెందిన లోకసాని వెంగయ్య అనే ఉపాధ్యాయుడి వద్ద నుండి బిల్ పాస్ చేసేందుకు ఎస్టీఓ మమత రూ.40వేలు డిమాండ్ చేశారు. ఏసీపీ డీఎస్పీ శిరీషా సూచనల మేరకు పవన్ అనే మధ్యవర్తికి బాధితుడు రూ.40వేల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్టీఓ మమతను కస్టడీలోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఘనటపై కేసు నమోదు చేశామన్నారు.