జామి మండలం అలమండ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలను వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని వరలక్ష్మి అవతారంలో అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా కుంకుమ పూజలు జరిపించారు. శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రత పూజకు ఎంతో విశిష్టత ఉందని ఆలయ అర్చకులు తెలిపారు.