వేపాడ: రాష్ట్రంలో రూ 4. 5 కోట్ల వ్యయంతో 30 వేల పనులు
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రూ. 4. 5 కోట్ల వ్యయంతో 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన్నట్లు రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి గొంప కృష్ణ అన్నారు. గురువారం వేపాడ మండలంలో అంక జోష్యపాలెంలో జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.