
బొబ్బిలి: గంజాయి అక్రమ రవాణా నిందితుడి అరెస్టు
2019లో ఐషర్ వ్యాన్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పరారైన నిందితుడు డ్రైవర్ చిరంజీవి ని రామభద్రపురం బైపాస్ రోడ్డులో పోలీసులకు గురువారం పట్టుబడ్డాడు. ఈ మేరకు సీఐ కె. నారాయ ణరావు, ఎస్సై వి. ప్రసాదరావు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. మండలంలోని కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో 266 కిలోల గంజాయిని వ్యాన్‌తో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన వ్యాన్‌ను స్వాధీనం చేసుకోగా డ్రైవర్ పరారయ్యాడు.