
బొబ్బిలి: 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త
పోస్టల్ సూపర్డెంట్ రెడ్డి బాబురావు ఆదేశాల మేరకు శనివారం బొబ్బిలి పట్టణం జెండా వీధిలో పిఎల్ఐ -ఆర్పిఎల్ఐ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా డెవలప్మెంట్ అధికారి ఏ. రవిబాబు మాట్లాడుతూ పోస్టల్ భీమాతో మంచి భవిష్యత్తు ఉంటుందని, భీమా చేసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. 18 నుంచి 55ఏళ్ల లోపు వారు భీమా చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏజెంట్లు పాల్గొన్నారు.