వైభవంగా నల్లమారమ్మ తల్లి పండగ

57చూసినవారు
దత్తిరాజేరు మండలంలోని దత్తిలో మంగళవారం రాత్రి సారిక వారి ఇలవేల్పు అయినా నల్ల మారమ్మతల్లి గ్రామ దేవత పండగను వైభవంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా గ్రామస్తులు అమ్మవారిని కొలుస్తుంటారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి ఘటాలను తీసుకువెళ్లి సమర్పించుకున్నారు. చీరలు, కోళ్లు, మేకపోతులతో మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్