మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

51చూసినవారు
మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. కొమరాడలో తీవ్రమైన ఎండల కారణంగా చనిపోయిన చేపలను ఆదివారం ఆయన చెరువుల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేపలు చనిపోవడం వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. మత్స్యశాఖ అధికారులు చేపల చెరువులను పరిశీలించి నష్టపోయిన వారికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్