సీతంపేట టూరిజం ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం అయన మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. టూరిజం ప్రాంతాలను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్షణ చర్యలు లేకుండా ఉంటే, దీనిపై కమిషన్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.