దేశ పటిష్ట ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు హక్కు ఎంతో కీలకమని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆర్. సి. యం కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్ల కార్డులను ప్రదర్శించి ఓటు హక్కు కాదు మన బాధ్యత కూడా, నిజాయితీగా ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని ర్యాలీ నిర్వహించారు.