మెంటాడ: రైతుల సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ సభలు
మెంటాడ మండలం ఉద్దంగి గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో బొబ్బిలి ఆర్డిఓ ఏవిఎస్ మోహన రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల రీసర్వే పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గ్రామాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించినందుకు గ్రామ సభలు నిర్వహించి వారీ నుంచి అర్జీలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, డిటిఎస్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.