ఎస్ కోటలో రాజీ చెరువుకు భారీ గండి

78చూసినవారు
ఎస్. కోటలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా స్థానిక రాజీ చెరువుకు ఆదివారం సాయంత్రం భారీ గండి పడింది. దీంతో చెరువులో నీరు దిగువ ప్రాంతాలకు పోటెత్తుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చెరువుకు గండి పూడ్చే పనులను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా గండి పూడ్చే పనుల్లో టిడిపి కార్యకర్తలు నిమగ్నమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్