వంట నూనె అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
వంట నూనె ధరలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రచురించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్ణయించిన ధరలకే వంట నూనె విక్రయాలు జరపాలని సూచించారు. వ్యాపారులు కొందరు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.