
విశాఖ: జియ్యాని శ్రీధర్ అక్రమాలకు కలెక్టర్కు ఫిర్యాదు
విశాఖ జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ భూ అక్రమాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కలెక్టర్కు, ఆర్. డి. ఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. గిడిజాలలో ప్రభుత్వ భూమిని జియ్యని కబ్జా చేశారని, రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. డీ పట్టా భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయాలు జరిపారని ఆరోపించారు.