వానరానికి అంత్యక్రియలు
మూగ జీవాలకు మేమున్నామని మానవత్వం చాటుకున్నారు ధర్మారెడ్డి హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు శంకర్ రెడ్డి. శుక్రవారం ఆనందపురం నుంచి పెందుర్తి వెళ్లే మార్గంలో వానరాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన కోతిని చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మరణించింది. దీంతో భీమిలి నియోజకవర్గ జనసేన నేత నీలాపు శంకర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.